పాలకుర్తి రూరల్, ఏప్రిల్ 8: అయ్యంగారిపల్లి, హఠ్యా తండా, నర్సింగపురం, తిరుమలగిరి, కొండాపురం, పెద్ద తండాకేల టీఆర్ఎస్ గ్రామ కార్యవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎంపీపీ నల్లానాగిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నవీన్, మండల ప్రధాన కార్యదర్శి బాలునాయక్ తెలిపారు. గురువారం కార్యవర్గాలను ప్రకటించారు. అయ్యంగారిపల్లి అధ్యక్షుడిగా నల్ల రమేశ్, ప్రధాన కార్యదర్శిగా లునావత్ బిక్కు, హఠ్యా తండా అధ్యక్షుడిగా పెండ్లి మనోహర్, ప్రధాన కార్యదర్శిగా ముస్కు ఆశోక్, తిరుమలగిరి అధ్యక్షుడిగా కూటికంటి పర్శరాములు, ప్రధాన కార్యదర్శిగా కౌడగాని సుధాకర్, నర్సింగపురం తండా అధ్యక్షుడిగా భూక్యా రాములు, ప్రధాన కార్యదర్శిగా భూక్యా రాంధన్, కొండాపురం అధ్యక్షుడిగా గడ్డం కిరణ్, ప్రధాన కార్యదర్శిగా మంగ మల్లేశ్, పెద్దతండాకే లావుడ్యా రమేశ్, ప్రధాన కార్యదర్శిగా ధరావత్ రవిని ప్రకటించారు. కార్యక్రమంలో కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాఘవరావు, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ అశోక్‌రెడ్డి, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
దేవరుప్పుల మండలంలో..
దేవరుప్పుల: నాలుగు గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ, అనుబంధ సంఘాల ఎన్నికలు నిర్వహించినట్లు ఎన్నికల ఇన్చార్జులు తీగల దయాకర్, పల్లా సుందరరాంరెడ్డి, బస్వ మల్లేశ్ తెలిపారు. సీతారాంపురం అధ్యక్షుడిగా బస్వ వెంకన్న, ఉపాధ్యక్షుడిగా అంబటి శ్రీశైలం, ప్రధానకార్యదర్శిగా ఆవుల వీరన్న, ప్రచార కార్యదర్శిగా గరిడె నర్సింహ, రైతు కమిటీ అధ్యక్షుడిగా గుంటి భీమేశ్, యువజన విభాగం అధ్యక్షుడిగా ఆలకుంట్ల ప్రవీణ్, దేవునిగుట్ట తండా అధ్యక్షుడిగా ధరావత్ సిరినాయక్, ప్రధానకార్యదర్శిగా ధరావత్ శంకర్, ఉపాధ్యక్షుడిగా ధరావత్ నందు, అప్పిరెడ్డిపల్లి అధ్యక్షుడిగా బాషిపల్లి యాకయ్య, ఉపాధ్యక్షుడిగా పులిగిల్ల శ్రీనివాస్, రైతు విభాగం అధ్యక్షుడిగా కాంటూరి శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడిగా కాంటూరి ప్రవీణ్, ఇక రాంచంద్రాపురం అధ్యక్షుడిగా మారజోడు రాజేందర్, ఉపాధ్యక్షుడిగా ఇరుగు ఇస్తారి, ప్రధాన కార్యదర్శిగా దామెరగాని మల్లేశ్, రైతు విభాగం అధ్యక్షుడిగా గుర్నాల సాంబరాజు, యూత్ అధ్యక్షుడిగా శోభన్‌బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ రాంనర్సయ్య, మండల నాయకులు రవి, సోమయ్య, భిక్షపతి, సోమనర్సయ్య, జలేందర్‌రెడ్డి, ఖాసీం, మైసారావు, కోతి ప్రవీణ్, హనుమంతు, రాంసింగ్, సీతారాంపురం సర్పంచ్ రమేశ్, మాధాపురం ఎంపీటీసీ యాఖూనాయక్, దేవునిగుట్ట సర్పంచ్ బాలూనాయక్, అప్పిరెడ్డిపల్లి సర్పంచ్ సుధాకర్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ధాన్యం కొనుగోలులో ఇబ్బంది లేకుండా చూడాలి
గిన్నిస్ రికార్డు గోర్లు.. 30 ఏండ్ల తర్వాత కత్తిరింపు