మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 03, 2020 , 18:03:11

విశాఖ ఏజెన్సీలో మందుపాతర పేలి ఇద్దరు మృతి

విశాఖ ఏజెన్సీలో మందుపాతర పేలి ఇద్దరు మృతి

అమరావతి : విశాఖ ఏజెన్సీలో మందుపాతర పేలి ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. పెదబయలు మండలం కొండ్రు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర అమర్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను మొండిపల్లి మోహన్‌రావు(26), మొండిపల్లి అజయ్‌కుమార్‌(20)గా పోలీసులు గుర్తించారు. మృతుల స్వస్థలం పెదబయలు మండలం చింతలవీధి గ్రామం. పశువులు కనిపించడం లేదంటూ అటవీ ప్రాంతం వైపు ఈ ఇద్దరు వెళ్లారు. ఈ క్రమంలో మందుపాతరపై వారు కాలు మోపడంతో అది పేలిపోయింది. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. 


logo