అమరావతి: సినీ నటుడు కత్తి మహేష్‌కు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదరిపై మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు.. లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న కత్తి మహేష్ స్వల్పంగా గాయపడ్డారు. ఆయన నెల్లూరులోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.