హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ తలనొప్పిగా మారాడా?.. తారక్ అంటే బాబకు భయం పట్టుకుందా?… ప్రస్తుతం బాబు పరిస్థితి చూస్తుంటే నిజమేననిపిస్తున్నది. చంద్రబాబు ఎక్కడికెళ్లినా ఆయనకు స్వాగతం పలికేవారిలో ఎన్టీఆర్ అభిమానులు ఉంటున్నారు. జై చంద్రబాబు, జై టీడీపీతోపాటు నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినదిస్తున్నారు.
ఈ మధ్య కుప్పంలో 40 అడుగుల ఫ్లెక్సీ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ స్లోగన్స్‌తో హోరెత్తించారు. ఈ ఫ్లెక్సీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల చనిపోయిన టీడీపీ నేత కాగితపు వెంకట్రావు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మచిలీపట్నంకు వెళ్లిన చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్ళు షాకిచ్చారు. పార్టీ జెండాలతోపాటు జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని స్వాగతం పలికారు.
ఇంత జరుగుతున్నా చంద్రబాబు బయటికి సైలెంట్గాఉన్నా లోలోపల ఆందోళనకు గురవుతున్నట్లు కొందరు పార్టీ నేతలు చెబుతున్నారు. తన వారసుడు లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ తలనొప్పిగా మారాడని బాబు సన్నిహితులతో వాపోయినట్లు తెలుస్తున్నది