బుధవారం 21 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Oct 01, 2020 , 21:18:47

ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం

 ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం

అమరావతి: కరోనాతో మృతిచెందిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తామని ఆంధ్రప్రదేశ్  రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. గురువారం ఆయన విజయవాడలో మృతిచెందిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ అంతర్రాష్ట్ర సర్వీసుల అంశంపై స్పందించారు. అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సు సర్వీసులు ఎప్పుడు నడుస్తాయనేది అంతులేని ప్రశ్నగా మారిందన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు ఎప్పుడు నడుస్తాయనే విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను అడగాలని మీడియా ప్రతినిధులకు పేర్ని నాని సూచించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo