గురువారం 25 ఫిబ్రవరి 2021
Andhrapradesh-news - Jan 27, 2021 , 21:31:10

పవన్ కళ్యాణ్‌కు చిరు సపోర్ట్..జనసేన నేత కీలక వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్‌కు చిరు సపోర్ట్..జనసేన నేత కీలక వ్యాఖ్యలు

జనసేన పార్టీలో చిరంజీవి కూడా భాగమేన‌ని  ఆ పార్టీ  కీల‌క‌నేత‌  నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. తమ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్  వెంట  నడవడానికి చిరంజీవి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జనసేనకు చిరంజీవి మద్దతునిస్తున్నట్లు ఆపార్టీ నేత నాదెండ్ల  ‌ వ్యాఖ్యలు చేయడం.. ఇప్పుడు జనసేన పార్టీ నేతల్లో కొత్త ఊపిరి పోసినట్లైంది. పార్టీ కార్యకర్తల సమావేశంలో బుధ‌వారం   మాట్లాడిన ఆయన.. పవన్‌ రాజకీయ ప్రస్థానంలో అన్నయ్య తోడు కూడా చాలా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

అంతేకాదు పవన్ మళ్లీ సినిమాలు చేయడానికి కారణం కూడా చిరునే అని చెప్పాడు మనోహర్. ఆయన చెప్పడం వల్లే పవన్ వరస సినిమాలు చేస్తున్నాడని.. ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదలయ్యేలా చూసుకోవాలంటూ అన్నయ్య చెప్పిన మాటలను శ్రద్ధగా తమ్ముడు విన్నాడని చెప్పాడు. రాజకీయ ప్రస్థానంలో తాను కచ్చితంగా ఉంటానని చిరంజీవి హామీ ఇచ్చారన్నాడు మనోహర్. పవన్‌తో చిరంజీవి ఉంటారని నాదెండ్ల బహిరంగంగా ప్రకటించ‌డం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

VIDEOS

logo