శుక్రవారం 05 మార్చి 2021
Andhrapradesh-news - Feb 23, 2021 , 18:40:07

ఏపీలో పెరిగిన కరోనా కేసులు

ఏపీలో పెరిగిన కరోనా కేసులు

అమరావతి : ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. ఇవాళ కొత్తగా 70 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  వైరస్‌ బారినపడి వారిలో చికిత్సకు కోలుకొని 84 మంది డిశ్చార్జి అయ్యారు. విశాఖపట్నంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 8,89,409 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 8,81,666 మంది చికిత్సకు కోలుకున్నారు.

మరో 575 మంది చికిత్స పొందుతున్నారు. ఇవాళ్టివరకు 7168 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు 28,268 మందికి కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నేటివరకు 1,37,75,253 శాంపిళ్లను పరీక్షించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo