కరోనా కారణంగా చాలా సినిమాలు అనుకున్న సమయానికి విడుదల కావడం లేదు. షూటింగ్స్ అయిపోయినా కూడా విడుదలకు నోచుకోవడం లేదు. షూటింగ్ దశలో ఉన్నవేమో అలాగే ఆగిపోతున్నాయి. పెద్ద పెద్ద సినిమాలు కూడా రిలీజ్ డేట్స్ మార్చుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం అనుకున్న టైమ్‌కే వస్తుందని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. అసలు విషయం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా ఈ మధ్యే 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఏఎం రత్నం నిర్మించిన ఈ చిత్రాన్ని ఎస్ జే సూర్య తెరకెక్కించాడు. అప్పట్లో ఈ సినిమా 20 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం మీడియా ముందుకొచ్చాడు. ఈ సందర్భంగా హరిహర వీరమల్లు రిలీజ్ ఎప్పుడు అనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు.
అప్పట్లో ఖుషి సినిమా సాధించిన విజయంతో పాటు నాటి పరిస్థితులను కూడా గుర్తు చేసుకున్నాడు రత్నం. పవన్‌తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి తన అనుభవాలు ప్రేక్షకులకు అందించాడు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తో ఇప్పుడు మరో సినిమా నిర్మిస్తున్నాడు ఈయన. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియన్ సినిమా హరిహర వీరమల్లు సినిమాను రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు ఏఎం రత్నం. చారిత్రాత్మక నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. కోహినూర్ వజ్రం టైమ్ లో ఉండే కథతో క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో పవన్ బందిపోటుగా నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం కరోనా కారణంగా ఆగిపోయిందని తెలిపాడు ఏఎం రత్నం.
పవన్ ప్రస్తుతం క్వారంటైన్ లోనే ఉన్నాడు. మరికొన్ని రోజులు అక్కడే ఉండబోతున్నాడు. ఇప్పట్లో షూటింగ్ మొదలు పెట్టి అనవసరంగా రిస్క్ తీసుకోవడం ఎందుకు.. పరిస్థితులు చక్కబడిన తర్వాతే సినిమాను మొదలు పెడతామంటున్నాడు రత్నం. అయితే షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టినా.. 2022 సంక్రాంతికి మాత్రం అనుకున్నట్లుగానే హరిహర వీరమల్లు రిలీజ్ చేస్తామని ధీమాగా చెప్తున్నాడు ఏఎం రత్నం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
F3 రిలీజ్ అయ్యేది అప్పుడే.. సెంటిమెంట్ నమ్ముకుంటున్న అనిల్ రావిపూడి
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
కరోనా నుంచి కోలుకున్నా: అనిల్ రావిపూడి
జబర్దస్త్ కమెడీయన్‌ను ఫాలో అవుతున్న బ్రహ్మానందం!
తేలికపాటి లక్షణాలే, కంగారు పడొద్దు: పూజా హెగ్డే
అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్..!
ఉప్పెన హీరోయిన్ డూప్.. వైరల్ అవుతున్న ఫొటోస్