శనివారం 24 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Sep 18, 2020 , 15:29:11

మరో సారి వాయిదా పడిన కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం

మరో సారి వాయిదా పడిన కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం

అమరావతి: కనకదుర్గ ఫ్లైఓవర్‌ కు మోక్షం కలుగడం లేదు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం... మరో సారి వాయిదా పడింది. తొలుత దీనిని ఈ నెల 4న ప్రారంభించాలని నిర్ణయించారు. సీఎం వైఎస్‌ జగన్, కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీలతో ప్రారంభోత్సవం చేయించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. అయితే ఆ సమయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణంతో ఈ నెల 8కి మార్పు చేశారు. కానీ వివిధ కారణాలతో 18వ తేదీకి మళ్లీ వాయిదా వేశారు.

అయితే తాజాగా కేంద్ర మంత్రి గడ్కరీకి కరోనా పాజిటివ్‌ రావడంతో మరోసారి వాయిదా పడింది. అయితే తదుపరి ప్రారంభోత్సవ తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ఎనిమిది నెలల కిందట పూర్తయిన బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్‌ కూడా ఈరోజే జాతికి అంకితం చేయాల్సి ఉన్నది. బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్‌ తరహాలోనే కనకదుర్గ ఫ్లైఓవర్‌పై నుంచి కూడా వాహనాలను అనుమతిస్తారని భావించారు. కానీ ఇప్పటికిప్పుడు అనుమతించడం సాధ్యం కాదని ఇంజినీరింగ్‌ అధికారులు స్పష్టం చేశారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo