e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News 24న కృష్ణపట్నం వెళ్లనున్న ఐసీఎంఆర్‌ బృందం

24న కృష్ణపట్నం వెళ్లనున్న ఐసీఎంఆర్‌ బృందం

24న కృష్ణపట్నం వెళ్లనున్న ఐసీఎంఆర్‌ బృందం

హైదరాబాద్‌ : భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) బృందం ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి వెళ్లనుంది. కరోనాకు ఇక్కడి ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న మందును పరీక్షించనుంది. ఈ బృందం ఆయుర్వేద మందు శాస్త్రీయతను పరీక్షించిన తర్వాతే తిరిగి పంపిణీ జరిగే అవకాశం ఉంది.

కరోనాకు ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై అనుమానాల నివృత్తి కోసం సీఎం వైఎస్ జగన్ శుక్రవారం అధికారులతో సమీక్షించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఆయుర్వేద మందుపై శాస్త్రీయ అధ్యయనం జరపాలని అధికారులకు సూచించారు. అధ్యయనం కోసం ఐసీఎంఆర్ బృందాన్ని కృష్ణపట్నం పంపించాలని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. రేపు సాయంత్రానికి ఐసీఎంఆర్ బృందం నెల్లూరు వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
24న కృష్ణపట్నం వెళ్లనున్న ఐసీఎంఆర్‌ బృందం

ట్రెండింగ్‌

Advertisement