శనివారం 16 జనవరి 2021
Andhrapradesh-news - Oct 25, 2020 , 19:16:10

గీతం కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

 గీతం కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

అమరావతి: విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేతపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేతల వ్యవహారంలో సోమవారం వరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని న్యాయస్థానం పేర్కొన్నది. గీతం నిర్మాణాల కూల్చివేతపై ఆ యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ చర్యలను ఆపాలని హైకోర్టులో హౌస్‍మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ముందస్తు నోటీసు ఇవ్వకుండా యూనివర్సిటీ నిర్మాణాలను అక్రమంగా కూల్చివేస్తున్నారని ఆ పిటిషన్‍లో తెలిపింది. క్రమబద్ధీకరణ ప్రక్రియ పెండింగ్‍లో ఉండగా నిర్మాణాలను కూల్చివేస్తున్నారని ఆరోపించింది. నేడు దీనిపై న్యాయస్థానంలో పూర్తిస్థాయిలో విచారణ జరగనున్నది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.