శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Andhrapradesh-news - Jul 12, 2020 , 16:54:00

కరోనాతో హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

కరోనాతో హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

కర్నూలు: జిల్లాలోని నంద్యాలలో కరోనాతో హెడ్‌కానిస్టేబుల్‌ ఒకరు మృతి చెందారు. హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పుల్లారెడ్డి గత కొన్ని రోజులుగా కరోనాతో బాధ పడుతున్నాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు.   జిల్లాలో రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరిగి పోతుంది. 

గడిచిన 24 గంటల్లో జిల్లాలో 237 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులిటిన్‌లో వెల్లడించారు. ఇప్పటివరకు 3405 మంది కరోనా బారిన పడగా 1884 మంది ఆస్పత్రుల్లో కోలుకొన్నారు. 1420 మంది  చికిత్స పొందుతున్నారు. ఏపీలో ఏ జిల్లాలో లేనివిధంగా ఇప్పటివరకు కర్నూలు జిల్లావ్యాప్తంగా 101 మంది కరోనాతో మృతిచెందడం ఆ జిల్లాలో కరోనా తీవ్రతను తెలియజేస్తుంది.

కృష్ణా జిల్లాలో 80మంది, గుంటూరులో  29 మంది, అనంతపురంలో 24 మంది, చిత్తూరులో 21 మంది, విశాఖపట్నంలో 15 మంది, శ్రీకాకుళంలో 13 మంది, పశ్చిమ గోదావరిలో 10మంది, తూర్పుగోదావరిలో 8, కడపలో 5, ప్రకాశంలో 5, విజయనగరంలో  7, నెల్లూరులో 10 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 13 జిల్లాలో 328 మంది కరోనా కాటుకు బలయ్యారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo