దుబాయ్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో ఎండలు దంచి కొడుతున్నాయి. సూర్యుడు మండుతుండటంతో అక్కడ 51.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు రిసార్టుల బాటపట్టారు. అల్ ఐన్‌లోని స్విహాన్లో ఆదివారం సీజన్లోనే హాటెస్ట్ డేగా నిలిచింది. గత శుక్రవారం కూడా 51డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు యూఏఈ జాతీయ వాతావరణ కేంద్ర ప్రతినిధి తెలిపారు. గత మే నెలతో పోలిస్తే ప్రసత్ఉత 2-3 డిగ్రీలు పెరిగిందని ఆయన చెప్పారు. చిన్నారులను కారులో ఒటరిగా వదలకుండా చూడాలని, లేదంటే తల్లిదండ్రులకు పదేండ్ల వరకు జైలుశిక్షతోపాటు రూ.2 కోట్ల జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
యూఏఈలో ఏడాదేడాదికి ఎండలు పెరిగిపోతున్నాయి. అంతకుముందు 2002 జూలైలో 52.1 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకున్నది. మరుసటి మూడు రోజుల్లోనే 51 డిగ్రీలకు పడిపోయింది. 60, 70 దశకాల్లో ఎంతో చల్లగా ఉండేదని, అయితే మారుతున్న పర్యావరణం కారణంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయని యూఏఈ ఖగోళ శాస్త్రవేత్త హసన్-అల్-హరిరి చెప్పారు. కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడానికి ప్రయత్నాలు మరింత ముమ్మరంగా సాగాలని, అన్ని ప్రపంచ దేశాలు ఈ విషయంపై దృష్టి సారించాలని సూచించారు. ఇలాఉండగా, చాలా మంది పెద్దవాళ్లు తమ పిల్లలను కార్లలో వదిలేసి షాపింగ్‌కు వెళ్తున్నారని, ఇది పిల్లకు చాలా ప్రమాదమని దుబాయ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఇలా ఏడాదికి 40, 50 మంది చిన్నారులు చనిపోతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇలా పిల్లలు చనిపోతున్నారనే విషయం యూఏఈలోని 55 శాతం మందికి తెలియదంట. బయటి వాతావరణం కన్నా కారులో వాతావరణం 10 డిగ్రీలు ఎక్కువగా ఉంటుందని, ఊపిరి ఆడకపోవడం వల్ల చిన్నారులు చనిపోతున్నారని పరిశోధకులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు ఏ కారణం చేతనైనా పిల్లలను కారులో వదిలేస్తే శిక్షార్హమైన నేరంగా పరిగణించి వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల దిర్హామ్ (దాదాపు రూ.2 కోట్లు) వరకు జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు.
మరింత శక్తి : వచ్చే నెలలో భారత్‌కు అమెరికా సీహాక్ హెలీకాప్టర్స్
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
రిత్రలో ఈరోజు.. ఆలిండియా రేడియోగా నామకరణం
కొత్త సేవలు : స్పీడ్ పోస్ట్‌లో అస్తికల నిమజ్జనం
ఇమ్యూనిటీ బూస్టర్ : పనస గింజల్లో దాగి ఉన్న ఆరోగ్యం
జీ 7 సమ్మిట్ : గ్లోబల్ టాక్సేషన్ సిస్టంకు గ్రీన్‌సిగ్నల్
ICAI CA 2021: సవరించిన షెడ్యూల్ విడుదల
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..