మంగళవారం 11 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 14, 2020 , 21:36:25

ఏపీఎస్‌ ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్‌సిగ్నల్‌

ఏపీఎస్‌ ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్‌సిగ్నల్‌

అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు. 2016 నుంచి విధినిర్వహణలో మరణించిన వారి వివరాలు పంపాలని ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్లకు ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు  ఆదేశాలు జారీ చేశారు. కారుణ్య నియామకాలకు వచ్చిన దరఖాస్తులు పంపాలని పేర్కొన్నారు. ఈనెల 16లోగా అన్ని వివరాలు పంపాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. 

ఆర్టీసీ సిబ్బంది  ప్రభుత్వంలో విలీనంతో కారుణ్య నియామక ప్రక్రియలో మార్పుతో కుటుంబ సభ్యుల అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు సంస్థ అధికారులు వెల్లడించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo