Andhrapradesh-news
- Oct 28, 2020 , 08:30:12
నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించాలని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాల్లో అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని ఆదేశించింది. వేడుకల నిర్వహణకు సంబంధించి తొమ్మిది మంది అధికారులతో కమిటీని ఏర్పాటుచేసింది.
2014, జూన్ 2న రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్ణయించలేదు. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా 1956, నవంబర్ 1న తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అప్పటి నుంచి నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
- దూరవిద్య పీజీ పరీక్షల తేదీల్లో మార్పు
- ఒకే కళాశాలలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
- శివగామి ఎత్తుకున్న చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూడండి!
- కాగ్‌లో 10,811 పోస్టులు
- ఈ నెల 31 వరకు ఎర్రకోట మూసివేత
- అజిత్ ముద్దుల తనయుడు పిక్స్ వైరల్
- పీఆర్సీ నివేదిక పూర్తి పాఠం
- రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు
- పట్టుకోలేరనుకున్నాడు..
- ఫ్లాట్లన్నీ విక్రయించాక.. అదనపు అంతస్థు ఎలా నిర్మిస్తారు
MOST READ
TRENDING