e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home ఏపీ భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఇక కానుకలు ఆన్‌లైన్‌లో చెల్లించొచ్చు

భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఇక కానుకలు ఆన్‌లైన్‌లో చెల్లించొచ్చు

భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఇక కానుకలు ఆన్‌లైన్‌లో చెల్లించొచ్చు

అమరావతి : ఆలయాల్లో అవినీతి కట్టడికి ఏపీ ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. సోమవారం టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఆలయాల నిర్వహణ వ్యవస్థ)ను  సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు‌. దేవదాయశాఖ పరిధిలోని ఆలయాలన్నింటినీ ప్రభుత్వం దీని పరిధిలోకి తీసుకువచ్చింది. ఈ విధానంలో ఆలయాలు.. వాటిలోని పలు సేవల వివరాలతోపాటు ఈ-హుండీ ద్వారా భక్తులు కానుకలు సమర్పించే అవకాశం కల్పించింది. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా సైతం కానుకల సమర్పణకు వీలుంది. ఈ ఆన్‌లైన్‌ పేమెంట్‌ వ్యవస్థను యూబీఐ నిర్వహించనుంది.

తొలిసారి అన్నవరంలో ఆలయంలో ఆన్‌లైన్‌ పేమెంట్‌ (ఈ-హుండీ) విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ నెలాఖరు నాటికి 11 ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్‌ చెల్లింపు విధానం అందుబాటులోకి తీసుకురానున్నారు. సేవల ప్రారంభంలో భాగంగా అన్నవరం ఆలయానికి ఈ -హుండీ ద్వారా యూబీఐ రూ. 10,116లను కానుకగా చెల్లించింది. ఆలయాల్లో అవినీతి కట్టడికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. ఆలయాల్లో స్వచ్ఛమైన పారదర్శక వ్యవస్థలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఇక కానుకలు ఆన్‌లైన్‌లో చెల్లించొచ్చు

ట్రెండింగ్‌

Advertisement