బుధవారం 30 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 12, 2020 , 10:29:19

కరోనాతో మాజీ మంత్రి మృతి

కరోనాతో మాజీ మంత్రి మృతి

హైదరాబాద్ : మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్ఏ ఖలీల్‌బాషా మంగళవారం కన్నుమూశారు. డాక్టర్ బాషా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇదీ కాక ఆయనకు కరోనా సోకినట్లు తెలిసింది. నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 

బాషా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కాలంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రిగా ఆయన పనిచేశారు. కడప ప్రసిద్ధ రాజకీయ నాయకుడిగా, వైద్య నిపుణుడిగా, పేదలకు ఎలాంటి ఫీజు లేకుండా వైద్య సేవ చేసినట్లు తెలిసింది. ఇటీవల ఆయన వైసీపీలో చేరినట్లు  సమాచారం. బాషా కుటుంబ సభ్యులకు టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేస్తూ బాషా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జనసేన కడప నియోజకవర్గ ఇన్‌చార్జి, రాయలసీమ జాయింట్ కన్వీనర్ సుంకర శ్రీనివాస్ జిల్లాలోని పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo