శుక్రవారం 03 జూలై 2020
Andhrapradesh-news - Jun 17, 2020 , 14:26:24

ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సఫీ కన్నుమూత

ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సఫీ కన్నుమూత

హైదరాబాద్‌ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ టీం కెప్టెన్‌ మహ్మద్‌ సఫీ(45) కన్నుమూశారు. ఉన్నట్లుండి ఒక్కసారిగా అనారోగ్యానికి గురైన ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. టీంలో మిడ్‌ఫీల్డర్‌గా ఉన్న సఫీ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తరపున స్థానిక టోర్నమెంట్లలో ఆడేవాడు. సీనియర్‌ నేషనల్స్‌ సంతోష్‌ ట్రోఫిలో రాష్ట్రం తరపున అనేక సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించాడు. సఫీ తండ్రి జీఎం షఫిక్‌ సైతం హైదరాబాద్‌ పోలీస్‌ టీం తరపున ఆడేవాడు. నేషనల్స్‌లో సైతం రాష్ర్టానికి ప్రాతినిధ్యం వహించాడు. సఫీ సోదరుడు మహ్మద్‌ షాజీ సెంట్రల్‌ ఎక్సైజ్‌ తరపున రాష్ర్టానికి ఆడుతున్నాడు.   


logo