గురువారం 13 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 15, 2020 , 13:15:00

శ్రీశైలానికి పెరిగిన వరద ప్రవాహం

శ్రీశైలానికి పెరిగిన వరద ప్రవాహం

క‌ర్నూల్ : శ‌్రీశైలం ప్రాజెక్టుకు వ‌ర‌ద ప్ర‌వాహం పెరిగింది. క‌ర్ణాట‌క‌లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో.. నారాయ‌ణ‌పూర్ ప్రాజెక్టు గేట్లు తెరిచారు. దీంతో జూరాల‌కు వ‌ర‌ద పోటెత్తింది. అక్క‌డ్నుంచి శ్రీశైల‌యానికి కృష్ణ‌మ్మ పరుగులు పెడుతోంది. క్ర‌మ‌క్ర‌మంగా వ‌ర‌ద పెరుగుతుండ‌టంతో శ్రీశైలానికి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. 

బుధవారం ఉదయం 49,895 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తున్నట్టు అధికారులు తెలిపారు. జురాల ప్రాజెక్టు నుంచి 48,795 క్యూసెక్కులు, హంద్రీనీవా నుంచి 1100 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 815.50 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 37.6570 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు.

జూరాలకు 60వేల క్యూసెక్కులు...

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి 60వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో జూరాల నుంచి 55వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 318.440 మీటర్లకు చేరింది. జూరాల నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ9.500 టీఎంసీలుగా ఉంది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo