బుధవారం 12 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 10, 2020 , 10:52:17

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం

కర్నూలు: జిల్లా పరిధిలో కురిసిన వర్షాలతో వస్తున్న వరదతో సుంకేశుల, హంద్రీ నుంచి 14.464 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరుకుంటుంది. ప్రసుత్తం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 814.10 అడుగులు కాగా నీటి నిల్వ 214 టీఎంసీలకు గాను ప్రస్తుతం 36.76 టీఎంసీలు నీరు నీల్వ ఉంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటి మట్టం 1.633 అడుగులుండగా ఇన్‌ఫ్లో ద్వారా  26వేల క్యూసెక్కుల నీరు ఈ ప్రాజెక్ట్‌కు వచ్చి చేరుతుంది. 286 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

జూరాల ప్రాజెక్టుకు 1.709క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1.498 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు, ప్రస్తుతం 7.817 టీఎంసీల నీరు ఉంది.  


logo