శనివారం 31 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Sep 18, 2020 , 13:46:46

విశాఖ ఏజెన్సీ లో వింత వ్యాధితో ఐదుగురు గిరిజనుల మృతి

విశాఖ ఏజెన్సీ లో వింత వ్యాధితో ఐదుగురు గిరిజనుల మృతి

విశాఖపట్నం : కరోనా మహమ్మారి తో ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మరొక వింత వ్యాధి కలకలం రేపుతున్నది. విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయతీ కరకవలస, చినరాబ గ్రామాల్లో మూడు వారాల వ్యవధిలోనే ఓ వింత వ్యాధితో ఐదుగురు గిరిజనులు మృతి చెందారు. దీనిపై అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ స్పందించి అధికారులతో మాట్లాడారు.

ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు ఏడీఎంహెచ్‌వో లీలాప్రసాద్‌ గ్రామాలకు చేరుకుని పరిస్థితిని పరిశీలించి, వింత వ్యాధి (కాళ్లు, చేతుల వాపులు)కి గల కారణాలపై ఆరా తీశారు. గురువారం ఉదయం వైద్య సిబ్బంది గ్రామాలకు చేరుకుని మూడు అంబులెన్స్‌లో కరకవలస, సొట్టడివలస, చినరాభ గ్రామాలకు చెందిన 18 మంది గిరిజనులను గజపతినగరం తరలించారు. వీరందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ గా తేలింది. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ ముందుస్తు చర్యల్లో భాగంగా వీరందరని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.