గురువారం 13 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 11, 2020 , 20:48:18

నిండిన ప్రకాశం బ్యారేజీ‌ .. దిగువకు నీటి విడుదల

నిండిన ప్రకాశం బ్యారేజీ‌ .. దిగువకు నీటి విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం బ్యారేజీ‌ పూర్థిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతుంది. ఈ సీజన్‌లో ఎగువభాగాన భారీ వర్షాలు కురుస్తుండడంతో వస్తున్న వరద నీటితో బ్యారేజీ నిండింది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజీకు చెందిన రెండు గేట్లను ఎత్తి ఈస్ట్రన్‌, వెస్ట్రన్‌ కెనాల్స్‌ ద్వారా  లక్షా 27వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి  విడుదల చేశారు.

శుక్రవారం అర్ధరాత్రి వరకు 15వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో బ్యారేజీ‌లోకి రావచ్చని అధికారులు భావిస్తున్నారు. నీటి విడుదల సామర్ద్యాన్ని అంచెలంచలుగా పెంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 
logo