ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Andhrapradesh-news - Jan 24, 2021 , 13:09:56

రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల మృతి

రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల మృతి

అమరావతి : రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృత్యువాతపడగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠం మండలం ఓంపల్లి చెరువు వద్ద చోటు చేసుకుంది. మృతులను ఉల్లూరు మండలం చిన్ననాగారెడ్డిపల్లికి చెందిన రామిరెడ్డి, ఉమేశ్‌గా గుర్తించారు. రామిరెడ్డి భార్యతో పాటు ఇద్దరు కుమారులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓంపల్లి చెరువు వద్ద ముందు వెళ్తున్న లారీని ఓవర్‌ టెక్‌ చేయబోసి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ఈ ఘటనలో రామిరెడ్డి, ఉమేశ్‌ మృత్యువాత పడగా.. భార్య, మరో కొడుకు గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

VIDEOS

logo