గురువారం 26 నవంబర్ 2020
Andhrapradesh-news - Oct 24, 2020 , 01:16:35

విశ్వరూపునికి అశ్వవాహనసేవ

 విశ్వరూపునికి అశ్వవాహనసేవ

తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ఎనిమిదోరోజైన శుక్రవారం రాత్రి మలయప్పస్వామి.. కల్కి అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో నిర్వహించిన అశ్వవాహన సేవలో ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి పాల్గొన్నారు. ఉదయం శ్రీవారు స్వర్ణరథంపై భక్తులను అనుగ్రహించారు.  బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం స్వామి వారికి ఉదయం 6 గంటల నుంచి 9 వరకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. అనంతరం చక్రస్నానం, రాత్రి 7 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవాన్ని నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. 

- తిరుమల, నమస్తే తెలంగాణ