గురువారం 24 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 15, 2020 , 18:39:35

టిటిడి ఉద్యోగుల‌కు ప్ర‌శంసాప‌త్రాలు అందించిన ఈవో

టిటిడి ఉద్యోగుల‌కు ప్ర‌శంసాప‌త్రాలు అందించిన ఈవో

తిరుపతి : తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గ‌ల ప‌రేడ్ మైదానంలో శ‌నివారం 74వ‌ భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. అనంత‌రం విధుల్లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన అధికారులకు సిబ్బందికి ప్ర‌శంసాప‌త్రాలు ప్ర‌దానం చేశారు. ఈ సందర్భంగా కోవిడ్‌-19 స‌మ‌యంలో ఆహార పొట్లాలు పంపిణీ చేయ‌డంలోనూ , శ్రీ‌నివాసం, విష్ణునివాసంలోని క్వారంటైన్ కేంద్రాల్లో మెరుగైన సేవ‌లందించిన 31 మంది అధికారులు, సిబ్బందికి ప్ర‌శంసాప‌త్రాలు అందించారు. ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన వివిధ విభాగాల‌కు చెందిన 47 మంది అధికారుల‌కు, 276 మంది సిబ్బందికి ప్ర‌శంసాప‌త్రాలు అంద‌జేశారు.  


logo