బుధవారం 23 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 13, 2020 , 07:15:28

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఏనుగు మృతి

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఏనుగు మృతి

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని తోట‌ప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ వ‌ద్ద ఏనుగు క‌ళేబ‌రం ల‌భ్య‌మైంది. స్థానికులు, అట‌వీశాఖ అధికారుల క‌థ‌నం ప్ర‌కారం.. గ‌త కొద్ది కాలం నుంచి తోట‌ప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ స‌మీపంలో ఓ ఆరు ఏనుగులు సంచ‌రిస్తున్నాయి. ఈ గుంపులోని ఓ ఏనుగు ఇటీవ‌లి కాలంలో క‌నిపించ‌లేదు. దీంతో రెండు రోజుల నుంచి ఏనుగు కోసం వెతుకుతున్నాం. ఆగ‌స్టు 12వ తేదీన తోట‌ప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ బ్యాక్ వాట‌ర్‌లో ఏనుగు క‌ళేబ‌రం ల‌భ్య‌మైంద‌ని తెలిపారు. 

ఏనుగు క‌ళేబ‌రాన్ని అట‌వీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం వెట‌ర్న‌రీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఏనుగు ప్ర‌మాద‌వ‌శాత్తు చ‌నిపోయిందా? లేక ఎవ‌రైనా గాయ‌ప‌రిచారా? అన్న‌ది పోస్టుమార్టం నివేదిక‌లో తేల‌నుంద‌ని అధికారులు పేర్కొన్నారు. 

ఒడిశాలో మ‌రో ఏనుగు

ఒడిశా సాంబాల్‌పూర్ జిల్లాలోని ధామా ఫారెస్ట్ రేంజ్ ఏరియాలో ఓ మ‌గ ఏనుగు చ‌నిపోయింది. దీని వ‌య‌సు 3 ఏండ్లు. ఏనుగు మృతికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంద‌ని జిల్లా అట‌వీ శాఖ అధికారి సంజీత్ కుమార్ తెలిపారు. ఏనుగు క‌ళేబ‌రాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. logo