ఆదివారం 25 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Jul 17, 2020 , 11:44:36

ఆగస్టులో దుర్గగుడి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి ప్రారంభం

ఆగస్టులో దుర్గగుడి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి ప్రారంభం

అమరావతి: విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్‌ బ్రిడ్జిని ఆగస్‌్్ట30నాటికి అంధుబాటులోకి తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.శుక్రవారం దుర్గగుడి ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను  విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేశ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్లై ఓవర్‌పనులు 97 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. పార్లమెంట్‌ సభ్యుడిగా కేశినాని నాని విజయవాడకు చేసిందేమి లేదని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఎవరెన్ని తప్పులు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనని వెల్లడించారు. కార్మికుల డబ్బును దుర్వినియోగం చేయడంతోనే టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లారని వివరించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo