గురువారం 04 మార్చి 2021
Andhrapradesh-news - Jan 24, 2021 , 15:21:20

శ్రీశైలంలో భక్తుల కిటకిట.. దర్శనానికి 3 గంటల సమయం

శ్రీశైలంలో భక్తుల కిటకిట.. దర్శనానికి 3 గంటల సమయం

శ్రీశైలం : ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతున్నది. ఏకాదశి కావడంతో తెల్లవారుజాము నుంచే భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులుదీరారు. ఉచిత దర్శనానికి మూడు గంటలు, శీఘ్ర దర్శనానికి గంట సమయం పడుతున్నది. దేశం నలుమూలల నుంచి వచ్చిన యాత్రికులతో పురవీధులు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.

స్వామివారి సామూహిక అభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చన, మృత్యుంజయ హోమాల్లో భక్తులు భారీగా పాల్గొన్నారు. వసతి గదులు అందుబాటులో లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ముందుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికే దేవస్థానం వసతి గదులు కేటాయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. సంప్రదాయ దుస్తులు ధరించిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. క్యూ లైన్లు, వసతి గదుల వద్ద ఆలయ సిబ్బందికి భక్తులు సహకరించాలని ఈఓ కేఎస్ రామారావు కోరారు. లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo