శనివారం 05 డిసెంబర్ 2020
Andhrapradesh-news - Oct 14, 2020 , 16:05:22

శోభా నాయుడు సేవలు చిరస్మరణీయం: పవన్ కళ్యాణ్

  శోభా నాయుడు సేవలు చిరస్మరణీయం: పవన్ కళ్యాణ్

అమరావతి : ప్రఖ్యాత కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ పురస్కార గ్రహీత శోభా నాయుడు మరణం తెలుగు కళా రంగానికి తీరని లోటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. "కూచిపూడి నృత్య పరంపరలో శోభా నాయుడు చేసిన సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. "సత్యభామగా, పద్మావతిగా, చండాలికగా ఆమె అభినయించిన నృత్య శైలిని కళాభిమానులు ఎన్నటికీ మరువలేరు. అనకాపల్లిలో జన్మించిన శోభా నాయుడు వెంపటి చినసత్యం గారి శిష్యరికంలో కళను అభ్యసించారు."

"తాను నేర్చిన విద్యను కళా ప్రదర్శనలకే పరిమితం చేయకుండా ఎందరికో నేర్పారు. శోభా నాయుడు గారి శిష్యులు వేలల్లో ఉన్నారంటే అది ఆమె కళా సేవకు తార్కాణం అని పవన్ పేర్కొన్నారు. శోభా నాయుడు అకాల మరణం తెలుగువారికే కాక కళాభిమానులు అందరికీ బాధాకరమేనని ఆయన అన్నారు. "ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శోభానాయుడు గారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను "అని పవన్ అన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.