ఆదివారం 09 ఆగస్టు 2020
Andhrapradesh-news - Aug 02, 2020 , 13:28:22

ప‌శ్చిమ గోదావ‌రి, అనంత‌పురం జిల్లాల్లో లాక్‌డౌన్‌

ప‌శ్చిమ గోదావ‌రి, అనంత‌పురం జిల్లాల్లో లాక్‌డౌన్‌

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు జిల్లాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. దీంతో ప‌శ్చిమగోదావ‌రి జిల్లా, అనంత‌పురం జిల్లాలో ఆదివారం పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్న‌ది. జూన్ 1 త‌ర్వాత రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించ‌డం ఇదే మొద‌టిసారి. కేవ‌లం మెడిక‌ల్ షాపులు మాత్ర‌మే తెరిచి ఉంటాయ‌ని అధికారులు ప్ర‌క‌టించారు. 

క‌రోనా వ్యాప్తిని నిలువ‌రించ‌డానికి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఆదివారం 114 సెక్ష‌న్ విధించారు. జిల్లాలో జూలై 23 నాటికి 10 వేల కేసులు న‌మోద‌వ‌గా, ప్ర‌స్తుతం అక్క‌డ 11,233 పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ప‌దివేల కేసులు దాటిన మొద‌టి జిల్లాగా నిలిచింది. ప‌శ్చిమ‌గోదావ‌రి త‌ర్వాత అనంత‌పురం, క‌ర్నూల్‌, విశాక‌ప‌ట్నం జిల్లాల్లో అత్య‌ధికంగా, వేగంగా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. 

ఏపీలో మొద‌టి క‌రోనా కేసు మార్చి 12న న‌మోద‌య్యింది. జూన్ 14 నాటికి 10 వేల కేసులు న‌మోద‌య్యాయి. జూలై 20 నాటికి 50 వేకు చేరాయి. కేవ‌లం 15 రోజుల్లోపే ల‌క్షా 50 వేలు దాటాయి. జూలై 20 నుంచి ఆగ‌స్టు 1 వ‌ర‌కు రాష్ట్రంలో 96,485 కేసులు న‌మోద‌వ‌గా, నాలుగు రోజుల్లోనే 39,912 పాజిటివ్ కేసులు రికార్డ‌య్యాయి.


logo