గురువారం 03 డిసెంబర్ 2020
Andhrapradesh-news - Oct 26, 2020 , 16:12:07

కర్నూల్‌లో కర్ఫ్యూ అమలు ...!

 కర్నూల్‌లో కర్ఫ్యూ అమలు ...!

 అమరావతి : కర్నూల్‌లో 144 సెక్షన్‌ను విధించారు. సాంప్రదాయ కర్రసాము పోటీలను నిలిపివేసిన పోలీసులు. ప్రతిఏడాది దసరా సందర్భంగా కర్నూల్‌ జిల్లాలోని దేవరగట్టు గ్రామంలో కర్రసాము పోటీలను నిర్వహిస్తారు. కర్నూల్‌లో దీనిని "బన్నీ"పండగగా పిలుస్తారు. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా దానిని నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారిచేశారు. దీన్ని ఆపే ప్రయత్నాలను పోలీసులు చేపట్టారు. మొత్తం 11 చెక్ పోస్ట్‌లను నిర్మించడంతో పాటు ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు ప్రాంతాలను మూసివేశారు. అటునుంచి ఇటు ఆలూరు, హోలగొండా, హలాహర్వీ మండలాలకు వచ్చే అన్ని ఆర్‌టీసీ బస్సులను నిలిపివేశారు. ఇంత జరుగుతున్న స్థానిక ప్రజలు బన్నీ పండగ జరిపేందుకే మొగ్గు చూపుతున్నారు. దాంతో ఏం చేయడానికీ లేక పోలీసులు అక్కడ 144 సెక్షన్‌ను విధించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి