శనివారం 27 ఫిబ్రవరి 2021
Andhrapradesh-news - Jan 18, 2021 , 18:06:43

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

అమరావతి :  ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో కొత్తగా కేవలం 81 కేసులు మాత్రమే నమోదయ్యాయి.  కరోనా బారినపడిన వారిలో 263 కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,86,066 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 8,77,212 మంది చికిత్సకు కోలుకున్నారు.

మరో 1713 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. నేటి వరకు 7141 మంది మృత్యువాతపడ్డారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 27,861 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 1,26,04,214 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo