మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 11, 2020 , 18:24:40

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,024 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 87 మంది మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 2,44,549కు, మరణాల సంఖ్య 2,203కు చేరుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో  87,597 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. అలాగే, 1,54,749  మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ మొత్తం 25,92, 819 కరోనా టెస్టులు నిర్వహించినట్లు పేర్కొంది.


logo