సోమవారం 06 జూలై 2020
Andhrapradesh-news - Jun 02, 2020 , 11:27:46

సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన వాయిదా

సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. తన పర్యటనలో భాగంగా జగన్‌  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో  భేటీ కావాల్సి ఉంది.  ఐతే అమిత్‌ షా షెడ్యూల్‌ మారడం వల్ల జగన్‌ పర్యటన వాయిదా పడినట్లు తెలిసింది. ఢిల్లీ టూర్‌లో భాగంగా  కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో పాటు  మరికొందరు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అవుతారని వార్తలు వచ్చాయి. 


logo