శనివారం 24 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Sep 12, 2020 , 16:33:20

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌

తిరుమల  శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి   జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 23వ తేదీన తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల  సందర్భంగా సీఎం  జగన్‌ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అదే విధంగా 24వ తేదీన  తిరుమలలోని కర్ణాటక సత్రాలకు కర్ణాటక సీఎం యెడియూరప్పతో  కలిసి  జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు రోజుల  పాటు తిరుమలలోనే సీఎం జగన్ ఉండనున్నారు.

గరుడ సేవ సందర్భంగా 23న సాయంత్రం శ్రీవారికి   జగన్ పట్టు వస్త్రాలు  సమర్పిస్తారు. అలాగే 24న ఉదయం జగన్‌ శ్రీవారిని  దర్శించుకోనున్నారు. ఏటా బ్రహ్మోత్సవాల మొదటి రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ.   ఈ ఏడాది  కరోనా నేపథ్యంలో  బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్ణయించింది.


logo