కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేయడంతో మళ్లీ సినిమా షూటింగ్స్ మొదలవుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ సెట్స్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అల్లు అర్జున్, రవితేజ, వెంకటేశ్ కూడా జులై మొదటివారంలో షూట్ కు రెడీ అవుతున్నారు. మరోవైపు పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ జులై 11న షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు.
స్టార్ హీరోలంతా చిత్రీకరణకు సిద్దమైతే ఒక్క స్టార్ హీరో మాత్రం ఇంకా రెడీ అవలేదట. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరనే కదా మీ డౌటు..సూపర్ స్టార్ మహేశ్‌బాబు. మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటివరకు మహేశ్ బాబు నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ కాల్ అందుకోలేదట.
మేకర్స్ సర్కారు వారి పాట షూటింగ్ రీస్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్. జులై మొదటి వారం నుంచి షూట్ మొదలుపెట్టేందుకు రెడీ అవ్వగా..మేకర్స్ మాత్రం మహేశ్‌బాబు నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం చూస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్.
ఇవి కూడా చదవండి..
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్