శనివారం 05 డిసెంబర్ 2020
Andhrapradesh-news - Aug 21, 2020 , 11:24:21

శ్రీశైలం ఘ‌ట‌న‌పై ఏపీ సీఎం దిగ్ర్భాంతి

శ్రీశైలం ఘ‌ట‌న‌పై ఏపీ సీఎం దిగ్ర్భాంతి

అమ‌రావ‌తి : శ్రీశైలం ఎడ‌మ‌గ‌ట్టు విద్యుత్‌కేంద్రంలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. ఎలాంటి స‌హాయ‌స‌హ‌కారాలు కావాల‌న్న అందించాల‌ని ఏపీ అధికారుల‌కు జ‌గ‌న్ ఆదేశించారు. షెడ్యూల్ ప్ర‌కారం జ‌గ‌న్ ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించాల్సి ఉండే. అగ్నిప్ర‌మాదం కార‌ణంగా త‌న ప‌ర్య‌ట‌న‌ను సీఎం జ‌గ‌న్ ర‌ద్దు చేసుకున్నారు. 

గురువారం రాత్రి విద్యుత్ కేంద్రంలోని ప్యాన‌‌ల్ బోర్డులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో భారీగా పొగ‌లు క‌మ్ముకున్నాయి. విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేయడంతో మంట‌లు ఆరిపోయాయి. ప్ర‌మాద స‌మ‌యంలో విధుల్లో 30 మంది సిబ్బంది ఉన్నారు. దీంతో సొరంగ మార్గం నుంచి 15 మంది బ‌య‌ట‌ప‌డ్డారు. పొగ‌లు క‌మ్మ‌కోవ‌డంతో ప్ర‌మాదంలో 9 మంది సిబ్బంది చిక్క‌కున్నారు. వీరిని బ‌య‌టకు తీసుకురావ‌డానికి పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన ఆరుగురు సిబ్బంది జెన్‌కో ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో డీఈ ప‌వ‌న్ కుమార్, ప్లాంట్ జూనియ‌ర్ అసిస్టెంట్ రామ‌కృష్ణ కూడా ఉన్నారు.