శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 09, 2020 , 09:40:56

అగ్నిప్రమాద మృతులకు రూ.50 లక్షల చొప్పున పరిహారం

అగ్నిప్రమాద మృతులకు రూ.50 లక్షల చొప్పున పరిహారం

అమరావతి : విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు సీఎం జగన్‌. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. వారి కుటుంబాల‌కు సీఎం ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు అగ్నిప్రమాదం సంభవించిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు విజయవాడ సిటీ పోలీసు కమిషనర్‌ శ్రీనివాసులు తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆ భవనంలో 30 మంది కరోనా బాధితులు, 10 మంది ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు. 

తాజావార్తలు


logo