శుక్రవారం 07 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 11, 2020 , 16:38:04

ఏపీలో విమాన షెడ్యూల్‌లో మార్పులు

ఏపీలో విమాన షెడ్యూల్‌లో మార్పులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమాన ప్రయాణ రోజులను మార్పు చేశారు. ఈనెల 14 నుంచి 31వ తేదీవరకు మారిన షెడ్యూల్‌ ఇలా ఉన్నాయి. చెన్నైకు గతంలో సోమ, బుధ, గురువారాలో్ విమానాలు నడుస్తుండగా ప్రస్తుతం మార్పులు చేసి మంగళ, గురు, శనివారాలకు చేశారు.

అదేవిధంగా హైదరాబాద్‌ నుంచి కడపకు మంగళవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం  విమాన సర్వీసు నడుస్తుండగా ఇప్పుడు సోమ. బుధ, శుక్ర, ఆదివారాల్లో నడుస్తాయని అధికారులు తెలిపారు. మారిన షెడ్యూల్‌ 14 నుంచి అమలులోకి వస్తుందని అన్నారు. ఇదే షెడ్యూల్‌ను ఇదేవిధంగా కొనసాగించవచ్చని, మార్పులు, చేర్పులు చేయవచ్చని వెల్లడించారు.


logo