శుక్రవారం 23 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Sep 26, 2020 , 01:53:51

చంద్రప్రభపై శ్రీవారి ఊరేగింపు

చంద్రప్రభపై శ్రీవారి ఊరేగింపు

తిరుమల, నమస్తే తెలంగాణ: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు శుక్రవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు చతుర్భుజ కేశవమూర్తి అలంకారంలో దర్శనమిచ్చారు. రాత్రి కల్యాణోత్సవ మండపంలో మలయప్ప స్వామి వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై ఊరేగారు. వాహనసేవలో పెద్ద జీయర్‌ స్వామి, చిన జీయర్‌ స్వామి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, డాక్టర్‌ నిశ్చిత, శివకుమార్‌, శేఖర్‌రెడ్డి, గోవిందహరి, డీపీ అనంత, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌ పాల్గొన్నారు. logo