ఆదివారం 07 మార్చి 2021
Andhrapradesh-news - Dec 18, 2020 , 21:11:02

టీడీపీ మాజీ ఎంపీ కార్యాలయాలపై సీబీఐ దాడులు

టీడీపీ మాజీ ఎంపీ కార్యాలయాలపై సీబీఐ దాడులు

హైదరాబాద్‌ : బ్యాంక్‌లను మోసగించిన కేసుకు సంబంధించి సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) శుక్రవారం టీడీపీ మాజీ ఎంపీ కార్యాలయాలపై రైడ్‌ చేసింది. మాజీ ఎంపీ స్వస్థలమైన గుంటూరు జిల్లాలో అదేవిధంగా హైదరాబాద్‌ నగరంలోని కార్యాలయాల్లో ఏకకాలంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతీయ కార్యాలయాల్లోని తమ సహచరుల సహకారంతో న్యూఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఈ రైడ్‌ చేపట్టింది. మాజీ ఎంపీకి చెందిన కంపెనీ రూ. 3,822 కోట్ల మోసానికి పాల్పడ్డట్లుగా సీబీఐ కేసు బుక్‌ చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ నిధులను ఇతర ప్రయోజనాల కోసం మళ్లించిందని ఆరోపణ. ఈ వ్యవహారంలో ఫిర్యాదు ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ సంస్థ ఇంతకుక్రితం కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. 

VIDEOS

logo