శుక్రవారం 07 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 11, 2020 , 15:24:21

మంత్రివర్గ ప్రతిపాదనలు పంపించాలి : ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి

మంత్రివర్గ ప్రతిపాదనలు పంపించాలి : ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి

అమరావతి: ఆంధ్రపదేశ్‌ మంత్రివర్గ సమావేశం ఈనెల 15న జరుగుతున్న దృష్ట్యా సంబంధిత శాఖల కార్యదర్శులు ప్రతిపాదనలను పంపించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ నీలం సాహ్ని ఆదేశాలు జారీచేశారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగుతుందన్నారు.

ఈనెల 13వ తేదీ సాయంత్రం 5గంటలలోగా ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు  మంత్రివర్గ సమావేశంలో తీసుకోవాల్సిన అంశాలపై ప్రతిపాదనలను పంపాలని ఆమె ఆదేశించారు. 


logo