శుక్రవారం 07 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 01, 2020 , 12:25:25

చెట్టెక్కిన ఎలుగుబంటి.. ఎంత ప్ర‌య‌త్నించినా దొర‌క‌ని పండు!

చెట్టెక్కిన ఎలుగుబంటి.. ఎంత ప్ర‌య‌త్నించినా దొర‌క‌ని పండు!

శ్రీ‌కాకుళం :  కొన్నిసార్లు అడ‌వి జంతువుల ప్ర‌వ‌ర్త‌న ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంది. ఇవి చాలా సంద‌ర్భాల‌లో మ‌నుషుల‌ను అనుస‌రిస్తున్న‌ట్లు అనిపిస్తుంది. వీటికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతునే ఉన్నాయి. వీటికి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో మ‌రో వీడియో చెలామ‌ణి అవుతున్నది. 

ఒక ఎలు‌గుబంటికి ప‌స‌న‌పండు తినాల‌నిపించింది. మ‌నుషుల‌ను అడిగితే ఇవ్వ‌రు క‌దా! అందుకే తానే స్వ‌యంగా చెట్టెక్కి కోసుకుందామ‌నుకున్న‌ది. మ‌నుషులు ఎక్కిన‌ట్లుగా ఎలుగుబంటి కూడా చెట్టెక్కె ప్ర‌య‌త్నం చేసింది. స‌గం చెట్టు ఎక్కింది. పండ్లు చేతికి అందే స‌మ‌యంలో ఏమైందో ఏమో ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. చెట్టు దిగేసింది. దీన్ని కొంత‌మంది గ్రామ‌స్తులు త‌న కెమెరా లెన్స్ ద్వారా వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సంఘ‌ట‌న‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీ‌కాకుళంలో జ‌రిగింది.


 


logo