శుక్రవారం 22 జనవరి 2021
Andhrapradesh-news - Nov 29, 2020 , 12:57:17

ఏపీ మంత్రి పేర్నినాని పై దుండగుడి హత్యాయత్నం

ఏపీ మంత్రి పేర్నినాని పై దుండగుడి హత్యాయత్నం

మచిలీపట్నం:  కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. మంత్రి తన ఇంట్లో ఉండగానే ఓ దుండగుడు... తాపీతో ఆయనపై దాడి చేయబోయాడు. అంతలోనే అప్రమత్తమైన అనుచరులు... ఆ దుండగుణ్ని పట్టుకొని... బలవంతంగా నిలువరించారు. మంత్రి అనుచరులు బలంగా పట్టుకొని అతన్ని వెనక్కి నెట్టి... తాపీ లాక్కున్నారు. ఈ దాడిలో మంత్రి చొక్కా పూర్తిగా చినిగిపోయింది. మొత్తానికి ఈ దాడి నుంచి మంత్రి తృటిలో తప్పించుకున్నారు.  వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతను ఎవరు, ఎందుకు దాడి చేయాలనుకున్నాడు, మంత్రిని చంపేయాలనేంత కసి ఎందుకు పెంచుకున్నాడు వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo