శనివారం 27 ఫిబ్రవరి 2021
Andhrapradesh-news - Jan 24, 2021 , 11:06:00

గుంటూరులో వ్యాక్సిన్‌ తీసుకున్న ఆశావర్కర్‌ మృతి

గుంటూరులో వ్యాక్సిన్‌ తీసుకున్న ఆశావర్కర్‌ మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న ఓ ఆశావర్కర్‌ మరణించారు. జిల్లాలోని తాడేపల్లి మండలం పెనుమాకలో విజయలక్ష్మి ఆశా వర్కర్‌గా పనిచేస్తున్నారు. వ్యాక్సినేషన్‌లో భాగంగా ఆమె ఈ నెల 19న టీకా వేయించుకున్నారు. అయితే రెండు రోజుల్లోనే అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను జీజీహెచ్‌లో చేర్చారు. దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌తో చనిపోయినట్లు ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఆదివారం ఉదయం ప్రకటించారు.

VIDEOS

logo