సోమవారం 13 జూలై 2020
Andhrapradesh-news - May 20, 2020 , 12:23:21

రేపటి నుంచి బస్సు సర్వీసులు ప్రారంభిస్తాం: ఆర్టీసీ ఎండీ

రేపటి నుంచి బస్సు సర్వీసులు ప్రారంభిస్తాం: ఆర్టీసీ ఎండీ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి   ఆర్టీసీ బస్సు సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు సంస్థ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ తెలిపారు. విజయవాడ, విశాఖలో సిటీ బస్సు సర్వీసులు నడపట్లేదని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతి వచ్చిన తర్వాతే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఉంటాయన్నారు. ఇవాళ ఆర్టీసీ ఎండీ ప్రతాప్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. 

'కరోనా సోకే అవకాశం లేకుండా బస్సులో సీట్లు తగ్గించాం. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. ఇప్పటివరకు ప్రత్యేక సర్వీసులు మాత్రమే నడిపాం. ఆటోమేటిక్‌గా చేతులను శుభ్రపరిచే శానిటైజర్‌ యంత్రాలను అందుబాటులో ఉంచుతాం. ప్రతి బస్టాండ్‌లోని ప్రతి షాపులో మాస్క్‌లు, శానిటైజర్‌ అమ్మాలు ఉంటాయి. మాస్క్‌ ధర రూ.10 మించకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నాం. ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్‌ బుకింగ్‌కు అవకాశం ఉంది. ఆర్డినరీ బస్సులకు కూడా ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించాం. అన్ని వ్యాలెట్లు, కార్డులు సహా ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు' అని ఎండీ  వివరించారు. 


logo