గురువారం 26 నవంబర్ 2020
Andhrapradesh-news - Oct 22, 2020 , 22:23:43

ఏపీ గ‌్రూప్-1 మెయిన్స్ వాయిదా

ఏపీ గ‌్రూప్-1 మెయిన్స్ వాయిదా

అమ‌రావ‌తి : ఏపీ గ్రూప్‌-1 మెయిన్స్ వాయిదా ప‌డింది. హైకోర్టు ఆదేశాల మేర‌కు 2018 గ‌్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ఏపీపీఎస్సీ ప్ర‌క‌టించింది. వ‌చ్చే నెల 2 నంచి 13వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించేలా గ‌తంలో షెడ్యూల్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో గ్రూప్‌-1 మెయిన్స్ షెడ్యూల్‌ను ఈ నెల 29న ప్ర‌క‌టిస్తామ‌న్న ఏపీపీఎస్సీ పేర్కొంది. గ్రూప్ -1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్‌లో లోపాలున్నాయని పేర్కొంటూ ప‌లువురు అభ్య‌ర్థులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్ర‌యించారు. త‌ప్పుడు ప్ర‌శ్న‌ల‌ను తొల‌గించి మ‌రొక జాబితాను విడుద‌ల చేయాల‌ని లేక‌పోతే మెయిన్స్‌లో తాము న‌ష్ట‌పోతామ‌న్న అభ్య‌ర్థుల వాదన‌ను హైకోర్టు అంగీకరించింది.