బుధవారం 28 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Aug 25, 2020 , 14:36:18

స్వర్ణ ప్యాలెస్‌ బాధితులకు ఎక్స్ గ్రేషియా అందజేత

స్వర్ణ ప్యాలెస్‌ బాధితులకు ఎక్స్ గ్రేషియా అందజేత

అమరావతి : విజయవాడ స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు ఆర్థికం సాయం అందించింది. మంత్రులు ఆళ్లనాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌ మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మట్లాడుతూ.. రమేష్ ఆస్పత్రి బాధ్యతారాహిత్యం వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఈ ఘటనపై సీఎం జగన్ మానవత్వంతో స్పందించి ఎక్స్‌గ్రేషియా మంజూరు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులు అనుమతుల్లేకుండా, భద్రతా ప్రమాణాలు పాటించకుండా కొవిడ్‌కేర్‌ సెంటర్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.logo