మంగళవారం 20 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Sep 27, 2020 , 18:39:25

ఏపీలో కొత్తగా 6923 పాజిటివ్‌ కేసులు

ఏపీలో కొత్తగా 6923 పాజిటివ్‌ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 6923  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్రవైద్యారోగ్యశాఖ తెలిపింది. తాజాగా మరో 45 మంది కరోనాతో చనిపోయారు. ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 675674కు పెరిగింది. 

ప్రస్తుతం రాష్ట్రంలో 64876 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 605090 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5708కు చేరింది. గడచిన 24 గంటల్లో 7,796 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 56,00,202 శాంపిల్స్‌ పరీక్షించారు. 



logo