శనివారం 31 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Sep 23, 2020 , 16:01:05

అమిత్ షాను తొల‌గిస్తారా? కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అమిత్ షాను తొల‌గిస్తారా? కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తిరుప‌తి : భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌న్న బీజేపీ డిమాండ్‌పై నాని స్పందించారు. ప‌ది మందిని తీసుకెళ్లి అమిత్ షాను తొల‌గించాలంటే తొల‌గిస్తారా? అని ఏపీ బీజేపీ నేత‌ల‌ను ఆయ‌న ప్ర‌శ్నించారు. ఎవ‌రి పార్టీ వ్య‌వ‌హారాలు వాళ్లు చూసుకుంటే మంచిది అని మంత్రి సూచించారు. నోటా కంటే త‌క్కువ ఓట్లు వ‌చ్చిన బీజేపీ నాయ‌కుల మాట‌లు హాస్యాస్ప‌దంగా ఉన్నాయ‌న్నారు. అత్య‌ధిక ఓట్లు సాధించిన జ‌గ‌న్‌కు స‌ల‌హా ఇచ్చే స్థాయి బీజేపీ నేత‌ల‌కు ఉందా? అని ప్ర‌శ్నించారు. ఉచిత స‌ల‌హాలు మాని నోటా కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకునేందుకు బీజేపీ నాయ‌కులు ప్ర‌య‌త్నించాల‌న్నారు. 

మోదీ ఒంట‌రిగా వెళ్తారు.. జ‌గ‌న్ కుటుంబ స‌మేతంగా వెళ్లాలా?

తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర స్వామి వారికి కుటుంబ స‌మేతంగా ప‌ట్టు వ‌స్ర్తాలు ఇవ్వాల‌న్న వ్యాఖ్య‌ల‌పై కూడా కొడాలి నాని స్పందించారు. ప్ర‌ధాని మోదీ త‌న భార్య‌ను తీసుకెళ్లి రామాల‌యంలో పూజ‌లు చేయ‌మ‌నండి. ప్ర‌ధాని మోదీ, యూపీ సీఎం యోగి మాత్రం ఒంట‌రిగా ఆల‌యాల‌కు వెళ్లి ప‌ట్టు వ‌స్ర్తాలు స‌మ‌ర్పించి, పూజ‌లు చేస్తారు. సీఎం జ‌గ‌న్ మాత్రం కుటుంబ స‌మేతంగా ఆల‌యానికి వెళ్లాలా? అని కొడాలి నాని ప్ర‌శ్నించారు.